శత వసంతాల ఉస్మానియా, ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఆరంభ వేడుకలు.. హాజరుకానున్న రాష్ట్రపతి

0
22

ఉస్మానియా యూనివర్సిటీ.. తెలుగు నేల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విద్యావనం. జాతిని జాగృతం చేసిన మేధో నిలయం. దేశం గర్వించదగ్గ ప్రముఖులెందరో ఈ వనంలో వికసించారు. ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. క్రీడాజ్యోతిని వెలిగించారు. నూరేండ్ల కిందట పురుడు పోసుకున్న ఉస్మానియా ఇప్పుడు వందేండ్ల సంబురాలకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ సంయుక్తంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో శతాబ్ది ఉత్సవాల ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేశాయి. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలను రూపొందించారు. 26వ తేదీ ప్రారంభ సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు. 27న ఆల్ ఇండియా వైస్‌చాన్స్‌లర్ల సమావేశం, 28న ఇండియన్, ఇంటర్నేషనల్ సైన్స్‌ఫెయిర్ నిర్వహించనున్నారు.

LEAVE A REPLY