శతాధిక వృద్ధుడిపై లైంగిక వేధింపుల కేసు

0
19

బ్రిటన్ న్యాయ చరిత్రలో ఇదో అరుదైన కేసనే చెప్పాలి. బాలికపై లైంగిక వేధింపుల కేసులో 101 ఏళ్ల వృద్ధుడిపై నమోదైన అభియోగాలు నిజమని తేలాయి. బర్మింగ్‌హామ్‌లోని ఎర్డింగ్టన్‌కు చెందిన రాల్ఫ్ క్లార్క్‌పై నమోదైన 21 అభియోగాలు నిజమేనని బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది. 1970, 1980లలో ఇద్దరు బాలికలపై రాల్ఫ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 1915లో జన్మించిన రాల్ఫ్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. దోషిగా తేలిన రాల్ఫ్‌కు సోమవారం శిక్ష విధించనున్నారు. ఈ కేసులో తీర్పు ఇచ్చే ముందు లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని, అందుకే తీర్పును వాయిదా వేసినట్టు న్యాయమూర్తి రిచర్డ్ బాండ్ పేర్కొన్నారు.

LEAVE A REPLY