వ‌ర్ణ‌వివ‌క్షను అమెరికా ఎలా అంతం చేస్తుంది ?

0
32

అమెరికా కాల్పుల్లో మృతిచెందిన శ్రీ‌నివాస్ కూచిభొట్ల భార్య సున‌య‌న దుమ‌ల ఫేస్‌బుక్‌లో త‌న భార‌మైన హృద‌య‌భావ‌న‌ను పంచుకుంది. ఆస్టిన్ బార్‌లో జ‌రిగిన విషాదం త‌న‌ను క‌లిచి వేసింద‌ని పేర్కొన్న‌ది. త‌న‌కు అండ‌గా నిలిచిన‌వాళ్ల‌కు, త‌న భ‌ర్త‌ను కాపాడ‌బోయిన ఇయాన్ గ్రిల్ల‌ట్‌కు కూడా ఆమె థ్యాంక్స్ చెప్పింది. క‌న్సాస్‌కు వెళ్లిన త‌ర్వాత గ్రిల్ల‌ట్‌ను క‌లుస్తాన‌ని ఆమె పేర్కొంది. త‌న భ‌ర్త మ‌ర‌ణ‌వార్త‌ను మోసుకొచ్చిన పోలీసుల‌తో తాను జ‌రిపిన సంభాష‌ణ గురించి కూడా సున‌య‌న త‌న బ్లాగ్‌లో ఆవేద‌న భ‌రితంగా వివ‌రించింది. వ‌ల‌స‌దారుల ర‌క్ష‌ణ‌పైన కూడా సున‌య‌న త‌న మ‌నసులో మాట‌ను పంచుకుంది. మ‌నం ఇక్క‌డివాళ్ల‌మేనా, మ‌నం క‌లలు క‌న్న‌ది ఈ దేశం గురించేనా, మ‌న కుటుంబాల‌ను, పిల్ల‌ల‌ను ఇక్క‌డ సురక్షితంగా చూసుకోగ‌ల‌మా అని ఆమె ప్ర‌శ్నించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here