వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం

0
19

యూపీఏ హయాంలో 2010-14 మధ్య వ్యవసాయ రంగానికి రూ.1.04 లక్షల కోట్లను కేటాయిస్తే మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.1.64 లక్షల కోట్లను కేటాయించిందన్నారు. రైతులకు పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, దీనివల్ల 2014-17 మధ్యకాలంలో 9.67 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. గత వ్యవసాయ సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆహారధాన్యాల ఉత్పత్తి 8.67 శాతం పెరిగి 27.33 కోట్ల టన్నులకు చేరుకుందని తెలిపారు. పప్పుదినుసుల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగి దాదాపు 2.24 కోట్ల టన్నులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. భూసార పరీక్ష కేంద్రాలను నెలకొల్పామని, రైతులకు ఇప్పటివరకు 7.34 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేశామన్నారు. యూపీఏ హయాంలో సేంద్రియ వ్యవసాయం 7.34 లక్షల హెక్టార్లకు మాత్రమే పరిమితమైతే తమ హయాంలో 20 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపారు. పాలు, చేపలు, కోడిగుడ్ల ఉత్పత్తి కూడా గతంలోకంటే భారీ స్థాయిలో పెరిగిందన్నారు. పంటనష్టం జరిగినందుకు యూపీఏ హయాంలో జాతీయ విపత్తు సహాయక నిధి నుంచి వివిధ రాష్ర్టాలకు 2011-14 మధ్య రూ.9,099 కోట్ల ఆర్థిక సాయం చేస్తే, తాము 2014-17 మధ్యకాలంలో రూ.29,194 కోట్ల సాయం చేశామని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని, రానున్న ఐదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఖాయమని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here