వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్లు మళ్లీ వైసీపీ గూటికి

0
13
ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కడప నగరపాలక సంస్థలోని కొందరు కార్పొరేటర్లు తిరిగి స్వగృహ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. గురువారం జగన్ జిల్లాకు రానున్న నేపథ్యంలో వారు తిరిగి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి 12 కార్పొరేటర్లు విడతల వారీగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ల సమక్షంలో పసుపు కండువా వేసుకున్నారు. అయితే వారిలో ఇద్దరు ముగ్గురు కొన్ని రోజులకే సొంత గూటికి వెళ్లారు.
ప్రస్తుతం మరో ఐదారుమంది ఆదే బాటలో పయనిస్తూ ఇడుపుల పాయలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిన ఓ కీలక కార్పొరేటర్‌తో పాటు మరో ఐదు మంది సొంత గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకొని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

LEAVE A REPLY