వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం శత్రువులుగా చూస్తున్నారు’

0
22

వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం శత్రువులుగా చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. క్యాంపు ఆఫీసులో సీఎం చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులివ్వాలని వినతిపత్రం ఇచ్చారు. నియోజకవర్గాలకు ఇచ్చే నిధులను టీడీపీ ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలతో పాటు 12 అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు నిధులు ఇవ్వడం లేదని, టీడీపీలో చేరిన వారికే నిధులు ఇస్తున్నారని వారు మండిపడ్డారు. సీఎంఆర్‌ఎఫ్‌ కింద కూడా నిధులు ఇవ్వడంలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here