వైఫై ట్రాష్ బిన్ సాధారణ చెత్త కుండీలను పోలి

0
23

రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో కొందరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు కదా. ఈ క్రమంలో అలాంటి వారిలో మార్పు తేవడం కోసం, చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ముంబైకి చెందిన ఓ స్టార్టప్ వినూత్న ప్రయోగంతో ముందుకు వచ్చింది. అదేమిటంటే… ఆ నగరానికి చెందిన థింక్ స్క్రీమ్ (THINK SCREAM) అనే ఓ స్టార్టప్ కంపెనీ కొత్తగా వైఫై ట్రాష్ బిన్‌లను తయారు చేసింది. వీటిలో చెత్త వేస్తే చాలు. యూజర్లు 15 నిమిషాల పాటు వైఫైని ఉచితంగా వాడుకోవచ్చు.

అయితే ఈ వైఫై ట్రాష్ బిన్ సాధారణ చెత్త కుండీలను పోలి ఉంటుంది. ఎత్తు నాలుగున్నర అడుగులు ఉంటుంది. దీని కింది భాగంలో ఓ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. అది యూజర్లు వేసిన చెత్తను గుర్తించి పై భాగంలో అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీన్‌కు మెసేజ్ పంపుతుంది. దీంతో ఆ మెసేజ్‌ను రిసీవ్ చేసుకున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఓ పాస్‌వర్డ్ దర్శనమిస్తుంది. దాన్ని ఉపయోగించి ట్రాష్ క్యాన్‌లో అమర్చిన వైఫై రూటర్‌కు యూజర్లు కనెక్ట్ అవచ్చు. ఈ క్రమంలో అలా చెత్త వేశాక ఓసారి వైఫైకు కనెక్ట్ అయితే దాన్ని 15 నిమిషాల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. 50 మీటర్ల దూరంలోనూ ఆ వైఫై ద్వారా ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ మధ్యే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వైఫై ట్రాష్ బిన్‌లకు మంచి స్పందనే వస్తుందని సదరు స్టార్టప్ చెబుతోంది. ఈ క్రమంలో ముంబై వ్యాప్తంగా ఇలాంటి వైఫై ట్రాష్ బిన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.

LEAVE A REPLY