వైద్య ప్రమాణాలు పాటించని ఆస్పత్రి సీజ్

0
27

ఖమ్మం: ఎలాంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నారని ఖమ్మం పట్టణంలోని స్పందన హార్ట్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఈ ఆస్పత్రిపై ఇటీవల పలు ఆరోపణలు రావడంతో స్పందించిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆస్పత్రిని సీజ్ చేయమని ఆదేశించారని వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో మాలతి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here