వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి

0
15

పదిహేను గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాక హడావుడి చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో గుండెపోటు వచ్చింది. చివరి దశలో ఆసుపత్రి సిబ్బంది వచ్చి చెప్పగా డ్యూటీ డాక్టర్‌ పరీక్షించి ఈసీజీ తీయిం చింది. అప్పటికే గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన శనివారం నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నకొండూరు గ్రామానికి చెందిన చెక్క లింగస్వామి స్థానికంగా సీఆర్పీగా పనిచేస్తున్నాడు.

ఆయన భార్య సవిత(28)కి నెలలు నిండడంతో శుక్రవారం సాయంత్రం నుంచి నొప్పులు రావడం మొదలయ్యాయి. వెంటనే హుటాహుటిన ఆటోలో చౌటుప్పల్‌ ఆస్పత్రికి తరలించారు. పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఓ పరిశ్రమలో సవిత ఉద్యోగం చేస్తుండడంతో వీరికి ఈఎస్‌ఐ కార్డు ఉంది. గర్భం దాల్చినప్పటి నుంచి నాచారంలోని ఈఎస్‌ఐ, మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందేది. ప్రసవ నొప్పులు వస్తుంటే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆరేళ్ల క్రితం మొదటి కాన్పు సాధారణంగా జరగడంతో కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా అదే భరోసాతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here