వైకుంఠ ఏకాదశి

0
22

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. విశిష్టమైన వైకుంఠద్వార దర్శనానికి భక్తులు ప్రవాహంలా తరలిరావడంతో శనివారం ఉదయానికే తిరుమలకొండ కిటకిటలాడింది. ఆదివారం వేకువజామున ఒంటిగంట తర్వాత టీటీడీ వైకుంఠద్వార దర్శనం కల్పిస్తోంది. ఈ నేపథ్యం లో శనివారం ఉదయం నుంచే వాహనాల్లో, నడక మార్గంలో భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ఉదయం 9 గంటల నుంచే భక్తులను క్యూలోకి అనుమతించడం ప్రారంభించారు. మూడుగంటల్లోనే మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్సు పూర్తిగా నిండిపోయాయి. మధ్యాహ్నం 2గంటలకు నారాయణిగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా కిటకిటలాడాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here