వైఎస్ ప్రకాష్‌రెడ్డి ఇంటికి జగన్

0
16
ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగనమోహనరెడ్డి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. 2వ తేదీ గురువారం జగన్ హైదరాబాద్‌ నుంచి రైలుమార్గం ద్వారా పులివెందులకు చేరుకుంటారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం ఆయన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ సతీమణి కృష్ణమ్మ సోమవారం అనారోగ్యంతో మృతిచెందింది. ఆయన కుటుంబాన్ని జగన పరామర్శించనున్నారు. అనంతరం పులివెందుల నుంచి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. తిరిగి 3వ తేదీ పులివెందులకు రానున్నారు.
పులివెందుల్లో జరిగే పలు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. దేవుని కడపలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 12గంటల ప్రాంతంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లతో జయరాజ ఫంక్షనహాల్‌లో సమావేశం కానున్నారు. 4వ తేదీ శనివారం పులివెందుల నుంచి 9గంటల ప్రాంతంలో బయలుదేరి పైడిపాళెం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడి నుంచి 11గంటల ప్రాంతంలో చెర్లోపల్లె పంప్‌హౌస్‌ను పరిశీలించనున్నారు. అదేరోజు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

LEAVE A REPLY