వేసవి నాటికి వీలైనన్ని ఆవాసాలకు తాగునీరు

0
27

వచ్చే వేసవికాలం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వీలైనన్ని ఆవాసాలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేసి ఆడబిడ్డల కష్టాలను దూరం చేస్తామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. తాగునీటి గోసను తీర్చడానికి సీఎం కేసీఆర్ తలపెట్టిన దైవకార్యాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి 24 గంటలు పనిచేయాలని వర్క్ ఏజెన్సీలను కోరా రు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం జలాల్‌పూర్‌లో నిర్మిస్తున్న ఇంటెక్‌వెల్, హెడ్‌వర్క్స్ పనులను ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఫ్లోర్ స్లాబ్ పూర్తి చేసి, చిన్నచిన్న పనులు మిగిలిపోయాయని అధికారులు వైస్ చైర్మన్‌కు వివరించారు. మార్చి చివరినాటికి ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లోని వీలైనన్ని ఆవాసాలకు ఇక్కడి నుంచే సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలన మిషన్ భగీరథ ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. పర్యటనలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ జగన్మోహన్ రెడ్డి, ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి, ఓఎస్‌డీ సత్యపాల్‌రెడ్డి, ఈఈ రమేశ్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here