వేరే బాయ్‌ఫ్రెండ్స్‌ గురించి… అడగరెందుకు?

0
18

నేను ధోనీతో మాత్రమే డేటింగ్‌ చేశానా? గతంలో నలుగురైదుగురితో రిలేషన్‌షిప్స్‌లో ఉన్నా. వాళ్ల గురించి ఎవరూ అడగరెందుకు? వాళ్లూ ఫేమస్‌ పీపులే! కానీ, ధోనీ గురించే ఎందుకు?… ధోనీ గురించి ఎవరు ప్రశ్నించినా ఇలా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు రాయ్‌ లక్ష్మీ. అలాగని, ముంబయ్‌ మీడియా ఆమెను ధోనీ గురించి అడగడం మానడం లేదు. అదే రాయ్‌ లక్ష్మీకి నచ్చడం లేదు. హిందీలో ఈ హీరోయిన్‌ నటించిన ‘జూలీ–2’ వచ్చే నెల 6న విడుదలవుతోంది.

ట్రైలర్, సాంగ్‌ ప్రోమోలు చూసినోళ్లు ఈ హీరోయిన్‌ ఎవరో? సన్నీ లియోన్‌కి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌ ఇచ్చేలా కనపడుతోందని కామెంట్‌ చేస్తున్నారు. ‘జూలీ–2’ ప్రమోషన్‌ కోసమని ముంబయ్‌ వెళ్లిన రాయ్‌ లక్ష్మీని చాలామంది ధోనీ డిస్కషన్‌తో రౌండప్‌ చేస్తున్నారు. ఓ సందర్భంలో చిరాకు ఎక్కువై, ‘ధోనీ ఎవరు?’ అని కూడా ప్రశ్నించారీ బ్యూటీ! ‘‘తనకు (ధోనీకి) పెళ్లైంది. నేనిప్పుడు ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. ప్రస్తుతానికి నాకు కెరీరే ముఖ్యం. ఇకపై ఎఫైర్స్‌ గురించి ప్రశ్నించొద్దు’’ అని రాయ్‌ లక్ష్మీ స్పష్టం చేశారు.

LEAVE A REPLY