వైకాపా రౌడీలకు గ్యాంగ్‌లీడర్‌ జగన్‌

0
23

కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాద బాధితులను పరామర్శించే సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరించిన తీరును మంత్రులు, తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. వైకాపాలోని రౌడీలకు గ్యాంగ్‌లీడర్‌గా జగన్‌ వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఆరోపించారు. ప్రమాద ఘటనలో రవాణా సంస్థ తప్పుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ బస్సులకు లైసెన్సులిచ్చి ప్రోత్సహించింది రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమేనని చెప్పారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబుపై చేయివేసి రెవెన్యూ, పోలీసు అధికారులంతా అవినీతిపరులని జగన్‌ అనడం దురదృష్టకమని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐఏఎస్‌లను జైళ్లకు తీసుకెళ్లడానికి ఇది వైఎస్‌ పాలన కాదని ఆయన పేర్కొన్నారు.

 

LEAVE A REPLY