వెలుగు చూసిన అక్రమ రేషన్‌ వ్యాపారం

0
3

అధికార పార్టీ నాయకుని రైస్‌ మిల్లులో రేషన్‌ బియ్యం రిసైక్లింగ్‌ జరుగుతుండగా కార్మికుడు మృతి చెందడంతో అవినీతి వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ సనిశెట్టి లక్మీనారాయణ మండలంలోని తిమ్మాయిపాలెం దళితవాడలో కొంత కాలంగా సాయి శరణ్య రైస్‌మిల్లు నడుపుతున్నాడు. ధాన్యం కొనుగోలు చేసి వాటిన రైస్‌గా తయారు చేసి విక్రయించాల్సిన ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. రేషన్‌ బియ్యాన్ని డీలర్ల నుంచి సేకరించి మిల్లులో పాలిష్‌ చేసి ఇతర ప్రదేశాలకు రవాణా చేస్తున్నాడు. బియ్యాన్ని రిసైక్లింగ్‌ చేస్తుండగా బడ్డీ ఒక్కసారిగా కూలిపోయి మిల్లు డ్రైవర్‌ షేక్‌హుస్సేన్‌(35) ప్రమాదవశాత్తు మృతి చెందడంతో రీసైక్లింగ్‌ వ్యవహారం బయటపడింది.

LEAVE A REPLY