వెన‌క్కి త‌గ్గిన ఆర్బీఐ..

0
30

న్యూఢిల్లీ: పాత నోట్ల డిపాజిట్ విష‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెన‌క్కి త‌గ్గింది. డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు ఒక్క‌సారి మాత్ర‌మే ఐదు వేల‌కు మించి పాత నోట్లు డిపాజిట్ చేయాల‌న్న నిబంధ‌న‌ను వెన‌క్కి తీసుకుంది. అయితే ఇది కేవ‌లం కేవైసీ వివ‌రాలు ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌కే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టంచేసింది. ఐదు వేల ప‌రిమితిపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆర్బీఐ ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక త‌ప్ప‌లేదు. ఈ మేర‌కు ఆర్బీఐ అన్ని బ్యాంకుల‌కు లేఖ‌లు పంపింది. నిబంధ‌న‌ల‌పై పునఃస‌మీక్ష నిర్వ‌హించామ‌ని, కేవైసీ క‌స్ట‌మ‌ర్ల‌కు ఐదు వేల ప‌రిమితిని ఎత్తివేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆ లేఖ‌లో ఆర్బీఐ స్ప‌ష్టంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here