వెనిజులాలో పెద్ద నోట్ల రద్దు!

0
53

వెనిజులా దేశంలో కూడా పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆ దేశ కరెన్సీలో పెద్దనోటైన 100 బొలివర్‌ను రద్దు చేస్తూ దేశాధ్యక్షుడు నికోలస్ మడురో ఆదివారం అత్యవసర డిక్రీ ఉత్తర్వుల పై సంతకంచేశారు. ప్రపంచ దేశాల్లో కెల్లా వెనిజులా అత్యధిక ద్రవ్యోల్బణాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మాఫియాలను దెబ్బతీయడంతోపాటు దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి బొలివర్ నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నారు. రద్దు చేసిన 100 బొలివర్ నోట్ల స్థానంలో అందుకు 200 రెట్ల ఎక్కువ విలువ గల కొత్త పెద్దనోట్లను, నాణాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో 100 బొలివర్ నోటు విలువ చాలా తక్కువ. ఒక్క 100 బొలివర్ నోటు విలువ ఒక డాలర్‌లోని మూడు సెంట్ల కంటే కూడా తక్కువే. 100 బొలివర్ నోట్‌తో ఒక చాక్లెట్ క్యాండీ మాత్రమే కొనవచ్చు, బర్గర్ కొనాలంటే అలాంటి 50 నోట్లు పెడితే కానీ రాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here