వెంకీ… ప్రయోగాలు

0
22

కొత్త తరహా కథలు, వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటాడు వెంకటేష్‌. అందుకే ఆయన్నుంచి సరికొత్త సినిమాలొచ్చాయి. ఇప్పటికీ అదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నారాయన. ‘గురు’కూడా అందులో భాగమే. తొలిసారి కోచ్‌ పాత్రలో కనిపించబోతున్నారు. రెగ్యులర్‌ సినిమాల్లోలా డ్యూయెట్లు, హీరోయిజం పలికించే సంభాషణలూ ఈ సినిమాలో ఉండవు. త్వరలోనే క్రిష్‌ దర్శకత్వంలో నటించనున్నారు వెంకీ. అది కూడా వెరైటీ కథేనట. ఈ చిత్రంలో వెంకీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని ఓ పాత్ర కోసం ఆయన గెటప్‌ ఛేంజ్‌ చేయనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది వరకు ఎప్పుడూ చూడని వెంకీ ఈ సినిమాలో తెరపై కనిపిస్తారట. ఓ పాత్రలో నెగిటివ్‌ లక్షణాలూ ఉంటాయని, ఈ సినిమాలో విలన్‌, హీరో రెండూ వెంకీనే అంటూ ప్రచారం జరుగుతోంది. గ్రాఫిక్స్‌కి పెద్ద పీట వేసిన ఈ చిత్రం ఈ యేడాది చివర్లోగానీ, వచ్చే యేడాది ప్రారంభంలోగానీ పట్టాలెక్కే అవ కాశాలున్నాయి. వెంకీ 75వ చిత్రం ఇదే కావొచ్చు కూడా.

LEAVE A REPLY