వెంకటలక్ష్మికి లక్షరూపాయల నగదు పంపిన సుకుమార్

0
14

‘రంగస్థలం’ సినిమా డైరెక్టర్ సుకుమార్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ‘జిల్ జిల్ జిగేల్ రాణి’ పాట పాడినందుకుగాను తనకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గంటా వెంకటలక్ష్మికి లక్షరూపాయల నగదు పంపించారు. తన చేత పాట పాడించుకుని డబ్బివ్వకుండా మధ్యవర్తి మోసం చేశాడని ఇటీవల వెంకటలక్ష్మి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వేదన విన్న డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి లక్ష నగదు ఇవ్వడంతో సింగర్ వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి

LEAVE A REPLY