వృద్ధురాలు దస్తగిరమ్మ మొక్కు తీర్చిన వైసీపీ అధినేత

0
24

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ‘తులాభారం’ మొక్కు తీర్చుకున్నారు. గతంలో ఆయన చెంచల్‌గూడ జైల్లో ఉన్నసమయంలో జైలు నుంచి జగన్‌ విడుదల కావాలని కోరుతూ కడపజిల్లా ప్రొద్దుటూరు మండలం బొజ్జవారిపల్లెకి చెందిన వృద్ధురాలు దస్తగిరమ్మ ఆ ఊరిలోని దర్గాస్వామికి ‘లడ్డూ తులాభారం’ ఇస్తానని మొక్కుకుంది. ఈ క్రమంలో జగన్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత తన మొక్కు తీర్చుకోడానికి జగన్‌కు ‘తులాభారం సందేశం’ పంపింది. ఇప్పటిదాకా దస్తగిరమ్మను కలిసే సమయం దొరక్క జగన్‌ రాలేకపోయారు. ఇటీవల వైసీపీ నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో భాగంగా బొజ్జవారిపల్లెలో దస్తగిరమ్మ తన మొక్కు విషయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డితో ప్రస్తావించింది. తన మొక్కు తీరేలా సహాయపడమని కోరింది.

LEAVE A REPLY