వీసా పొడిగింపు నిబంధనలు కట్టుదిట్టం

0
7

భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై పెను ప్రతికూల ప్రభావం చూపేలా హెచ్‌1–బీ వీసాల జారీలో అమెరికా భారీ మార్పులు చేసింది. విదేశీ కంపెనీల తరఫున అమెరికాలోని ‘థర్డ్‌ పార్టీ వర్క్‌ సైట్ల’లో పనిచేసేవారికి హెచ్‌–1బీ వీసాల జారీని కఠినంచేస్తూ కొత్త పాలసీ తెచ్చింది.

ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్‌–1బీ వీసా కోరుతున్న ఉద్యోగి పనిచేయాల్సిన అవసరాన్ని, వారి నైపుణ్యాల్ని కంపెనీలు నిరూపించాలి. హెచ్‌–1బీ వీసాదారు వర్క్‌ కాంట్రాక్ట్‌ ఎంతకాలముంటే అంత కాలానికే వీసాలు జారీ చేస్తామని, ఒకవేళ వీసాల్ని పొడిగించుకోవాలనుకుంటే తాజా నిబంధనల్ని పాటించాల్సిందేనని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం తెలిపింది. ఉద్యోగి తరఫున వీసా దరఖాస్తు సమయంలోనే ఆ వివరాల్ని సమర్పించాలని సూచించింది.   భారతీయ కంపెనీల తరఫున హెచ్‌–1బీ వీసాదారులు పనిచేసే కంపెనీలను ‘థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్లు’ అంటారు

LEAVE A REPLY