వీరభద్రసింగ్‌ అప్పీలును తిరస్కరించిన ఐటీఏటీ

0
23

ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఆదేశాలను సవాలు చేస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ చేసిన అప్పీలును ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ) తిరస్కరించింది. అయితే ఈ చర్యల వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని.. ఐటీఏటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయిస్తానని వీరభద్రసింగ్‌ అన్నారు. 2009-10, 2011-12 సంవత్సరాలకు సంబంధించి వీరభద్రసింగ్‌ పన్ను రిటర్న్‌లకు సంబంధించి తాజా వివరాలు సమర్పించాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించగా.. దాన్ని సవాలు చేస్తూ వీరభధ్రసింగ్‌ ఐటీఏటీకి అప్పీలు చేశారు. వ్యవసాయం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందినట్లు వీరభద్రసింగ్‌ పేర్కొన్న నేపథ్యంలో తగు విచారణ చేశాకే ఐటీ శాఖ వివరాలు కోరిందని.. ఐటీ కమిషనర్‌ నిర్ణయంతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని ఐటీఏటీ వెల్లడించింది.

LEAVE A REPLY