వీఐపీ స్థానంలో ఈపీఐ : ప్రధాని మోదీ

0
16

దేశంలోని ప్రతి పౌరుడూ ముఖ్యమనే భావనతోనే వీఐపీల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సాధారణ ప్రజలు ముఖ్యమన్నా మోదీ.. వీఐపీ కల్చర్ స్థానంలో ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్) కల్చర్ తీసుకొస్తున్నామని ప్రకటించారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ వేసవిలో మన ఇళ్లకు వచ్చే పోస్ట్‌మ్యాన్, పాలు వేసే వ్యక్తి, కూరగాయాలు అమ్మేవారికి మంచినీరు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఈ వేసవిలో పక్షుల దాహార్తి తీర్చేందుకు చిన్నారులు నీటి కుండలు ఏర్పాటు చేయడం తన దృష్టికొచ్చిందని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల అంశంపై ప్రత్యేక సెమినార్లు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మన్ కీ బాత్ ద్వారా చిన్నారుల ఆలోచనలు, యువత అభిలాష, పెద్దల ఆలోచనలు తెలుసుకోవాలనుకున్నానని మోదీ తెలిపారు. రేపు గుజరాత్, మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆ రెండు రాష్ర్టాల ప్రజలకు తన అభినందనలు తెలిపారు. సెలవుల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. నూతన ప్రదేశాలు, ప్రాంతాలకు వెళ్లి కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. మే 5న నిర్వహించనున్న దక్షిణాసియా ఉపగ్రహం ఈ ప్రాంతానికి భారతదేశం ఇచ్చిన కానుక అని పేర్కొన్నారు.

LEAVE A REPLY