‘విశ్వరూపం 2’

0
11

పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టిపెట్టిన కమల్‌హాసన్‌ ఇప్పటికే నటిస్తున్న సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక ‘శెభాష్‌ నాయుడు’ చిత్రీకరణ జరుగుతోంది. ఇదిలా ఉండగా శంకర్‌ దర్శకత్వంలోని ‘భారతీయుడు 2’ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పూర్వ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇటీవల తైవాన్‌లో ‘భారతీయుడు 2’ బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు శంకర్‌. ఇందులో నయనతారను కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఇందులో కీలకపాత్ర పోషించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అజయ్‌కు పాత్ర వివరాలు శంకర్‌ చెప్పారని, ఆయన నటించడానికి అంగీకరించారని తెలిసింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

LEAVE A REPLY