విశాఖలో విస్తారంగా వర్షాలు..

0
16

ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లాలోని రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జిల్లాలోని రైవాడ, కోనాం, పెద్దేర్‌ రిజర్వాయర్లు రిజర్వాయర్లు ప్రమాదకరస్థాయికి చేరాయి. దీంతో రైవాడ రిజర్వాయర్‌ నుంచి 300 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిపెట్టగా.. కోనా రిజర్వాయర్‌ నుంచి 150 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఇక, పెద్దేరు రిజర్వాయర్‌ నుంచి 2వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది.  కల్యాణ లోవ రిజర్వాయర్‌ ఔట్‌ఫ్లో 150 క్యూసెక్కులు కిందకు వదిలేశారు. రిజర్వాయర్ల నుంచి భారీ నీటిని కిందకు వదిలేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో జిల్లాలోని రోడ్లు జలమయం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది.

LEAVE A REPLY