వివాదాస్పద భూమిపై రగడ

0
8

ఆదివాసీలకు, లంబాడీల మధ్య నెలకొన్న భూవివాదం కొత్తగూడ మండల కేంద్రంలో పరస్పర దాడులకు దారితీసింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డా రు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ఆదివాసీలు ధర్నా చేపట్టగా, గొడవ మొదలుపెట్టి న ఆదివాసీలపై చర్యలు తీసుకోవాలని లంబాడీలు నినాదాలు చేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నాం కొత్తగూడ మండల కేంద్రంలో ఉద్రిక్త వాతవరణం చోటు చేసుకుంది.
మండలంలోని వేలుబెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రౌతుపల్లితండా సమీపంలో భూ మి విషయంలో ఆదివాసీలకు, రామన్నగూడెం, కొర్రతండా గ్రామస్థులకు కొంతకాలంగా భూ వివాదం నెలకొంది. వాస్తవానికి భూ వివాదం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇదే అంశంపై గ్రామస్థులకు ఆదివాసీలకు మధ్య సోమవారం రౌతుపల్లి తండా సమీపం లో పంచాయితీ జరిగింది. పంచాయితీలో వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. లంబాడీలు చేసిన దాడిలో ఆదివాసీలు 8మందికి గాయాలయ్యాయని ఆరోపిస్తూ ఆదివాసీ సంఘాలు తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో ధర్నా చేశారు. దాడులకు పాల్పడిన లంబాడీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. దాడులకు పాల్పడిన ఆదివాసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here