విమాన ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఎంపీ

0
16

సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన ఓ ఎంపీ సహనం కోల్పోయి ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టారు. ఒకటి కాదు ..25 సార్లు కొట్టి తన చర్యను సమర్థించుకున్నారు. గురువారం ఎయిర్ ఇండియా విమానంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పుణె నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆయన వద్ద బిజినెస్ క్లాస్ టిక్కెట్ ఉన్నా ఎకానమి క్లాస్‌లో కూర్చొబెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ విమానం ల్యాండ్ అయిన తర్వాత దిగేందుకు నిరాకరించారు. విమాన ఉద్యోగి కిందకు దిగాల్సిందిగా సూచించడంతో ఎంపీ ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదంలో సహనం కోల్పోయిన ఎంపీ ఉద్యోగిని చెప్పుతో బాదారు. ఉద్యోగి తనతో దురుసుగా ప్రవర్తించాడని, తాను ఎంపీనని చెప్పినా వినకుండా నీ సంగతి ప్రధానికి చెప్తానన్నాడని తెలిపారు. కోపం ఆగలేక ఉద్యోగిని చెప్పుతో కొట్టానని వివరించారు. ఎంపీ దాడి చేయడంతో తన కండ్లజోడు కూడా విరిగిపోయిందని ఎయిర్ ఇండియా ఉద్యోగి వాపోయారు.

LEAVE A REPLY