విప్లవ వీరుడు కాస్ట్రోకు కన్నీటివీడ్కోలు

0
25

వివా ఫిడెల్ (ఫిడెల్ చిరకాలం వర్ధిల్లాలి) అంటూ వేల మంది అభిమానులు, కార్యకర్తల నినాదాల మధ్య మన కాలపు పోరాటయోధుడు ఫిడెల్ కాస్ట్రో అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం దేశ జాతీయ వీరుల సమాధుల పక్కనే విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో చితాభస్మాన్ని ఖననంచేశారు. వారంపాటు సంతా ప దినాలు పాటించిన తర్వాత శాంటియాగో డి క్యూబా పట్టణంలో ఆదివారం 19వ శతాబ్ది స్వతంత్రపోరాట యోధుడు జోస్ మార్తి సమాధి పక్కనే నిర్మించిన కాస్ట్రో సమాధిలో చితాభస్మాన్ని ఖననం చేశారు. అంతకుముందు ప్రజలకు అనుమతిలేని ఈ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీధుల్లో వేల మంది వివా ఫిడెల్ అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆయన మద్దతుదారులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.

LEAVE A REPLY