విపక్షాలు నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి

0
20

ప్రధాని నరేంద్రమోదీకి దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు నైరాశ్యంలోకి వెళ్లిపోయాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. దిగజారి ప్రధానిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ జనవేదన సభను మనోవేధన సభగా ఆయన అభివర్ణించారు. గురువారం విజయవాడ గేట్వేలో జరిగిన ఏవియేషన్ సదస్సులో వెంకయ్య పాల్గొన్నారు. వ్యక్తిగతంగా వారి తల్లిదండ్రులను దూషించే స్థాయికి దిగిజారిపోయారని మండిపడ్డారు. తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని, సామాన్యుడు దేశానికి ప్రధాని కావడం, ప్రపంచ ప్రఖ్యాతి సాధించడం వాళ్లు దాన్ని భరించలేని పరిస్థితిలో ఉన్నారని వెంకయ్య అన్నారు.

LEAVE A REPLY