విపక్షాలపై విరుచుకు పడ్డ ప్రధాని మోదీ

0
38

నోట్లరద్దుపై ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై విమర్శల ధాటి పెంచారు. అవినీతి పరుల అంతు చూసేందుకు తమ ప్రభుత్వం ఉద్యమిస్తుంటే విపక్షాలు నిజాయితీరహితులకు కొమ్ము కాస్తున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. అవినీతి, నల్లధనంపై చర్చ జరుపుదామంటే విపక్షాలు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఏటీఎంల వద్ద క్యూలో నిల్చున్నవారిని రెచ్చగొట్టేందుకు కొందరు రాజకీయవేత్తలు ప్రయత్నిస్తున్నారని, కానీ దేశ విస్తృత ప్రయోజనాల కోసం సామాన్యులు ఓపిక పడుతున్నందు వల్ల వారి కుట్రలు పనిచేయడం లేదని అన్నారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో తాను లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం, రాజకీయ పార్టీల విరాళాల సేకరణపై చర్చ చేపడుదామని సూచించానని ప్రధాని గుర్తు చేశారు. రెండు అంశాలపై ఏమాత్రం ఆసక్తి లేని విపక్షాలు పార్లమెంటును నెలపాటు స్తంభింపజేశాయని మండిపడ్డారు. ఒకప్పుడు విపక్షాలు కుంభకోణాలు, అవినీతిని బైటపెట్టేందుకు పార్లమెంటును స్తంభింపజేసేవని, ఇప్పుడు నిజాయితీరహితులను కాపాడేందుకు పార్లమెంటును అడ్డుకుంటున్నాయని దుయ్యబట్టారు. దేశాన్ని అవినీతి, నల్లధనం నుంచి విముక్తం చేయడం మా ఎజెండా.. కానీ పార్లమెంటును మూసేయడమే వారి ఎజెండాగా కనిపిస్తున్నది. ఇది నాకు అంతుచిక్కడం లేదు అని ప్రధాని పేర్కొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here