విన్ డీజెల్ కి ట్రెడిషనల్ వెలకమ్ చెప్పిన ముంబై ఫ్యాన్స్

0
20

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే నటించిన హాలీవుడ్ చిత్రం ‘ట్రిపుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్’. ఈ చిత్రం జనవరి 14న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. విన్ డీజెల్, టోనీజా, శామ్యూల్ జాక్సన్, టోని కొలెట్, నినా డొబ్రెవ్, రూబీ రోజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ మూవీపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. విన్‌డీజిల్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఈ రోజు హైదరాబాద్ వచ్చాడు. ఆయనతో పాటు దీపిక , డీజె కరుసోకి ముంబై అభిమానులు ట్రెడిషనల్ వెలకమ్ చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని దీపిక తన అఫీషియల్ పేజ్ లో పోస్ట్ చేసింది. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here