విడాకుల కేసులో స్పేస్ ఫ్లైట్ టిక్కెట్

0
15

బ్రిటన్‌లోని భారత సంతతి దంపతుల మధ్య విడాకుల కేసులో అంతరిక్షంలో విహార యాత్ర కోసం కొనుగోలు చేసిన విమాన టిక్కెట్ కూడా వచ్చి చేరింది. ఆ టిక్కెట్ ధర రూ. 1,34,27,984 (1.60 లక్షల పౌండ్లు). దుబాయి కేంద్రంగా మారా గ్రూప్ అనే వాణిజ్య సంస్థ అధిపతి ఆశీష్ టక్కర్ 2008లో మీనా మానిక్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. అయితే గొడవలు రావడంతో 2013 నుంచి విడిగా ఉంటున్నారు. తన భర్త నుంచి విడాకుల కోసం లండన్ హైకోర్టులో మీరా మానిక్ పిటిషన్ దాఖలు చేశారు. భార్యకు విడాకులిచ్చేందుకు భారీగా భరణం చెల్లించాల్సి వస్తుందన్న ఆలోచనతో ఆశీష్ టక్కర్ తన ఆస్తులు కేవలం రూ.3,73,91, 230. 84 (4,45,532 పౌండ్లు) మాత్రమేనని పేర్కొనడంతో వివాదం మొదలైంది. భర్త ఆస్తుల వివరాలు దాచి పెట్టడంతో మీరా మానిక్.. ఈ విమాన టిక్కెట్ ధర సంగతి బయటపెట్టారు. అంతరిక్షంలో ఔత్సాహికుల పర్యటనకు విర్జిన్ గాలాక్టిక్ సంస్థ తొలి వ్యోమనౌకను పంపేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందుకోసం ఔత్సాహికులతో విమాన ప్రయాణానికి టిక్కెట్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఆశిష్ టక్కర్ కూడా ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో ఒకరు. ఆ టిక్కెట్ కొనుగోలుచేసినప్పుడు దంపతులిద్దరూ కలిసే ఉన్నారు. బిలియనీర్ అయిన టక్కర్ ఆస్తుల్లో ఈ విమాన టిక్కెట్ ధరనూ చేర్చాలని లండన్ హైకోర్టులో మీరా మానిక్ తన విడాకుల పిటిషన్‌లో కోరారు. దీనిపై సోమవారం లండన్ హైకోర్టు విచారణ చేపట్టనున్నది.

LEAVE A REPLY