విజేత పోరాటం

0
22

కన్నతండ్రి ఆశయం కోసం, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేసాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు సాయిధరమ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విన్నర్. గోపీచంద్ మలినేని దర్శకుడు. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ గెలుపు కోసం అనుక్షణం తపించే ఓ విజేత కథ ఇది. కుటుంబబంధాలతో పాటు యాక్షన్, ప్రేమ, వినోదం అంశాల సమాహారంగా సాగుతుంది. సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవలే మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదల చేసిన సితార సితార అనే పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ఒక పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ గీతాన్ని ఈ నెల 12 నుంచి చిత్రీకరించనున్నాం. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 9న థియేట్రికల్ ట్రైలర్‌ను, 19న ఆడియో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం అని తెలిపారు. సాయిధరమ్‌తేజ్ నటన, తమన్ బాణీలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, పాటలన్నీ వీనుల విందుగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు. జగపతిబాబు, ముఖేష్‌రుషి, అలీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: ఛోటా.కె.నాయుడు, సంగీతం: ఎస్.ఎస్. తమన్, కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: అబ్బూరి రవి, నృత్యాలు: రాజు సుందరం, శేఖర్, ఫైట్స్: స్టన్ శివ, రవివర్మ, ఎడిటర్: గౌతంరాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here