విజయ్ మాల్యాకు భారీ షాక్!

0
5

లండన్: బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయి తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో పెద్ద షాక్ తగిలింది. 1.55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 వేల కోట్లు) వ్యాజ్యంలో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మాల్యా ఉద్దేశపూర్వకంగానే రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారని జడ్జి ఆండ్రూ పేర్కొన్నారు. దీంతో భారతీయ బ్యాంకులు తాము ఇచ్చిన మొత్తం సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. కాగా, మాల్యాకు రుణాలిచ్చిన భారతీయ బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది

LEAVE A REPLY