విజయవాడలో ఓ వివాహిత మృతదేహాన్ని తరలిస్తుండగా…

0
29
విజయవాడలో ఒక వివాహిత మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొత్త ప్రభుత్వాసుపత్రిలో బుధవారం ఇరు పక్షాలు దాడులకు దిగాయి. పోలీసులు, సెక్యూరిటీ గార్డులు వారించినా మృతురాలి బం ధువులు ఏమాత్రం వినలేదు. ఆమె భర్త ప్రేమ్‌కుమార్‌, అతని తల్లి నాగేంద్రమ్మ, ఆమె కుమార్తెలపై దాడికి దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని గట్టిగా పట్టుకుని వారించడానికి వెళ్ల నీయలేదు. మృతురాలి బంధువు ఆగ్రహంతో ఊగిపోయారు.
 విజయవాడ అయోధ్యనగర్‌లో నివసిస్తున్న దివ్యాంగురాలు ఆవుల కీర్తి బీకాం చదివింది. ఆమె తండ్రి రవీంద్ర బ్యాంకు ఉద్యోగి కాగా, తల్లి మాధవి గృహిణి. ముత్యాలంపాడులోని ఒక కంప్యూటర్‌ శిక్ష ణ సంస్థలో చేరిన కీర్తికి సింగ్‌నగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ నెల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే మంగళవారం స్నేహితురాలి వద్దకు వెళ్లిన కీర్తి తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రమాదానికి గురయింది. తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం తొలుత తాడేపల్లిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కీర్తి మృతి విషయం తెలుసుకున్న ఆమె తల్లి, బంధువులు బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here