వింత వ్యాధి.. సాయం చేయండి

0
29

జన్యు సంబంధమైన వింత వ్యాధితో బాధపడుతున్న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన 18 ఏండ్ల రమ్యశ్రీ అనే యువతి ఆర్థికసాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖరాశారు. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రమ్యశ్రీ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని కార్యాలయానికి వెళ్లి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మీడియాతో మాట్లాడుతూ చిన్నప్పుడు అందరిలాగానే నేనూ ఉత్సాహంగా ఉండేదాన్ని. కాలక్రమంలో జన్యుసంబంధ వ్యాధి సోకింది. మ్యూకోపాలీ శాకరిడోజ్ (ఎంపీఎస్-6)గా పిలిచే ఈ వ్యాధిని సాధారణంగా మారోటియాక్స్-లామిసింట్రోమ్‌గా కూడా వ్యవహరిస్తుంటారు. దీని చికిత్సకు నాగ్లజైమ్ అనే ఔషధాన్ని వాడాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇది ఖరీదైనది. అంతేకాకుండా అమెరికాలో మాత్రమే లభ్యమవుతుంది. దీన్ని మన దేశానికి తీసుకొచ్చేందుకు డ్రగ్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. ఏటా కోటి రూపాయల మేరకు ఖర్చవుతుంది. చికిత్స చేయించేంత ఆర్థికస్థోమత మా కుటుంబానికి లేదు. ప్రధాని ఆర్థికసాయం అందించాలి అని లేఖలో కోరాను అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here