వాహనదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు

0
31

రహదారులపై టోల్ తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు ప్రారంభమవడంతో చిల్లర కొరతతో అటు వాహనదారులు, ఇటు టోల్‌ప్లాజా నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాలతో రుసుము వసూలు చేసినా.. కార్డులు, సరిపడ చిల్లర లేనివాళ్లు నానా తిప్పలు పడ్డారు. పలుచోట్ల వాహనదారులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనేకచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ వసూలును మరికొన్ని రోజులు నిలిపి వేయాలని, రూ.500, రూ.100, రూ.50 నోట్లను అవసరమైన మేర విడుదల చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY