వాళ్ళ పన్ను ఇంకా పీకుతారు

0
39
నల్లకుబేరులకు కష్టాలు మరిన్ని పెరుగనున్నాయి. నవంబర్ 8 తర్వాత డిపాజిట్ చేసిన సొమ్ముపై భారీగా పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. దీనికి సంబంధించిన ఒక బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభ ముందు ఉంచారు. లోక్‌సభలో గందరగోళం మధ్యే ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లెక్క చెప్పలేని సొమ్ముపై 30 శాతం పన్ను విధించే వీలుంది. మినహాయింపులు పోగా పన్ను విధించే సొమ్ముపై 33 శాతం సర్‌చార్జ్ విధించే అవకాశం ఉంది. దీనిని కృషి కళ్యాణ్ సెస్‌గా పరిగణిస్తారు. మరో 10 శాతం పెనాల్టీ కూడా విధించొచ్చు. ఇక మిగిలిన సొమ్ములో 25 శాతం బ్యాంకుల్లో దీర్ఘకాలిక డిపాజిట్లుగా జమచేస్తారు. 25 శాతం సొమ్మును వైట్ మనీగా పరిగణించి వెంటనే చెతికిచ్చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం తొలుత స్వచ్చంధ ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత పెద్దనోట్లను రద్దు చేసింది. డిసెంబర్ ఆఖరి వరకు దీనికి గడువు ఉంది. బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షల వరకు డబ్బు జమచేసుకునే వీలుందని వెసుబాటు కల్పించింది. ఇప్పుడు డిసెంబర్ ఆఖరి తర్వాత పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం ఇప్పుడే జవాబిచ్చింది. ఇంకా నల్లధనాన్ని దాచిన వారిపై కఠిన చర్యల కోసం పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం లెక్క తేలని సొమ్ముపై భారీగా పన్ను విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here