వార్షిక బడ్జెట్‌ను ముందస్తుగా ప్రవేశపెట్టడానికి కేంద్రం

0
22

ముందుగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆపలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రతిఏడాది ఫిబ్రవరి ఆఖరు వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టడం అన్నది సర్వసాధారణం. అయితే ఈసారి 2017-2018 బడ్జెట్‌ను మరికొన్ని రోజలు ముందుగా ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెడుతామని కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగడానికి ముందుగా రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిని ఆపాలని డిమాండ్ చేశాయి. ఇదే విషయమై ఎంఎల్ శర్మ అనే అడ్వొకేట్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు

LEAVE A REPLY