‘వార్ధా’ ప్యాకేజీ కోరిన త‌మిళ ఎంపీలు

0
23

తమిళనాడును తాకిన వార్దా తుఫాన్‌పై ఇవాళ రాజ్య‌స‌భ‌లో స్వ‌ల్ప చ‌ర్చ జ‌రిగింది. అత్య‌వ‌స‌రంగా ఆ అంశాన్ని స‌భ్యులు చ‌ర్చించారు. వార్దా వ‌ల్ల చెన్నై తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ద‌ని సీపీఐ నేత డీ. రాజా అన్నారు. కేంద్ర బృందం త‌మిళ‌నాడును విజిట్ చేయాల‌ని ఆయ‌న కోరారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప‌రిస్థితి దుర్బ‌రంగా ఉంద‌ని, ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాల‌న్నారు. తుఫాన్ వ‌ల్ల విద్యుత్తు సంబంధాలు తెగిపోయాయ‌ని, ఇంటర్నెట్‌, టెలిఫోన్ క‌నెక్ష‌న్లు క‌ట్ అయ్యాయ‌న్నారు. కేంద్రానికి చెందిన నిపుణుల బృందం రాష్ట్రాన్ని విజిట్ చేయాల‌ని డీఎంకే నేత తిరుచి శివ కోరారు. సుమారు 10వేల కోట్లు రిలీజ్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. చెన్నై, కంచీపురం, తిరువల్లూర్ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లింద‌ని ఎంపీ రంగ‌రాజ‌న్ అన్నారు. వార్దా వ‌ల్ల 15000 చెట్లు కూలాయని, ఉత్పత్తి తగ్గిపోయింద‌న్నారు. ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌ను ఏర్పాటు చేసినందుకు ప్ర‌భుత్వాన్ని మెచ్చుకుంటున్న‌ట్లు ఎంపీ చిదంబ‌రం అన్నారు. న‌ష్టంపై ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వార్ధా బాధిత ప్రాంతాల‌కు కావాల్సిన సాయం చేస్తామ‌ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

LEAVE A REPLY