వారియర్స్‌కు చెన్నై షాక్

0
21

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న అవధే వారియర్స్ (21)కు చెన్నై స్మాషర్స్ షాకిచ్చింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పీవీ సింధు సారథ్యంలోని చెన్నై జట్టు 4-3తో అవధ్‌ను ఓడించింది. దీంతో స్మాషర్స్ 17 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో వాంగ్ వింగ్ 6-11, 11-9, 12-10తో సెన్‌సోమ్‌బున్సాక్‌పై గెలువగా, మిక్స్‌డ్‌లో క్రిస్-గాబ్రియెల్ 11-4, 11-9తో ఇసారా-సావంత్‌లను ఓడించడంతో ఇరుజట్ల స్కోరు 1-1తో సమమైంది. తర్వాత ట్రంప్ మ్యాచ్‌లో కశ్యప్ 11-7, 5-11, 11-7తో అదిత్య జోషీపై, సింధు 11-4, 11-6తో రితూపర్ణ దాస్‌పై నెగ్గడంతో చెన్నై స్కోరు 4-1కి పెరిగింది. పురుషుల డబుల్స్ ట్రంప్ మ్యాచ్‌లో గో వీ షెమ్-మార్కిస్ కిడో 12-10, 11-8తో సుమీత్-కోల్డింగ్‌పై గెలిచినా అవధ్ ఒక్క పాయింట్ తేడాతో ఓటమిపాలైంది. అవధ్ వారియర్స్, చెన్నై స్మాషర్స్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here