వారిని కాపాడటంలో తెలంగాణే ఫస్ట్‌: రేవంత్‌

0
10

అవినీతిపరులను కాపాడటంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2016లో సరైన సమాచారం లేదనే సాకుతో 125 మందిపై ఏసీబీ కేసులు ఉపసంహరించుకున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్‌ విలేకరులతో మాట్లాడుతూ నిమ్స్‌ వైద్యుడు శేషగిరిరావు, ఏసీపీ సంజీవరావులు రూ. కోట్లలో అవినీతికి పాల్పడినా వారిని కేసుల నుంచి తప్పించారని ఆరోపించారు.

కేసీఆర్‌ బంధువర్గానికి చెందిన వారు ఎంత అవినీతికి పాల్పడ్డా వారిపై కేసులుండవని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆరే కమీషన్‌ తీసుకోమన్నారంటూ సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెల్లడించినా ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌ జరిపిన సమీక్షలో రాజకీయ కోణం కనపడుతోందని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY