వర్సిటీ కాంట్రాక్ట్ సిబ్బంది జీతాల పెంపునకు కసరత్తు

0
14

యూనివర్సిటీ కాంట్రాక్ట్ సిబ్బంది జీతాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. అన్ని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు, పార్ట్‌టైమ్ లెక్చరర్లు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే అంశంపై సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్‌గా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావును నియమించారు. సభ్యులుగా ఓయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం ముత్తారెడ్డి, కేయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ జగన్నాథస్వామి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి సభ్యులు కన్వీనర్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సి ఉన్నది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 2,500 టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు పెరుగడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరశురామ్, ప్రధాన కార్యదర్శి నిరంజన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here