వర్షం ఆ కుటుంబంలో విషాదం నింపింది

0
9

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. వర్షం ఆ కుటుంబాన్ని మృత్యువు రూపంలో కబలించింది. నిద్రిస్తున్న సమయంలో భారీ వర్షాలకు ఓ ఇళ్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన కృష్ణగిరి సమీపంలోని తనడికుప్పంలో గురువారం తెల్లవారు జామున జరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు బాగా కురుస్తున్నాయి.ఈ వర్షాలకు ఓ ఇళ్లు కూలి ఆ ఇంట్లో నిద్రిస్తున్న రాధ(65), పుష్ప(35), వసంత(15), భగవతి(13), ముల్లా(8) అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ఆస్పత్రికి తరలించారు.

అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని  పోలీస్‌ అధికారి తెలిపారు. రెస్కూ టీం, ఫైర్‌ సిబ్బంది సహాయంతో శిథిలాల కింద ఉన్న మృత దేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కృష్ణగిరి  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY