వర్మ వల్లే సివిల్స్ సాధించా 624 ర్యాంకర్‌ అక్షయ్‌కుమార్‌

0
7

‘నేను రామ్‌ గోపాల్‌ వర్మకు వీరాభిమానిని. వర్మకు సంబంధించిన ఏ ఒక్క వీడియోను మిస్సవ్వను. చెప్పాలంటే సివిల్స్‌ పరీక్షకు ఒక్క రోజు ముందు కూడా వర్మకు సంబంధించిన ఓ వీడియోను చూశాను. త్వరలో ఆయన్ని కలవాలనుకుంటున్నాను. కానీ నేను ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన్ని కలుస్తాను. ఎందుకంటే ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉంటే నన్ను పట్టించుకోరనే భయం. అదే జరిగితే నేను భరించలేను. లాజికల్‌గా ఎలా మాట్లాడాలన్నది వర్మ నుంచే నేర్చుకున్నాను. ప్రపంచంలోని అందరి తత్వవేత్తల గురించి వర్మ చదివారు. కాబట్టి నేను వారి గురించి చదవడం కంటే వర్మను చదవడం నయం అనిపించింది. దీని వల్ల నా పనులు సులువుగా చేసుకోగలుగుతున్నాను. వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమా చాలా సార్లు చూశాను. నేరాలకు సంబంధించిన సినిమాలు తీయడంలో వర్మది విభిన్న శైలి. నా గ్యాంగ్‌లో ఉన్న ఐదుగురు స్నేహితులను కూడా వర్మ అభిమానులుగా మార్చేశాను’ అని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here