వరకట్న వేధింపుల కేసులో రంభకు సమన్లు

0
18

వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరుకావాలని బుధవారం సినీ నటి రంభకు బంజారాహిల్స్ పోలీసులు సమన్లు అందజేశారు. వరకట్నం కోసం వేధిస్తున్నారని శ్రీనివాసరావు భార్య పల్లవి తన భర్త, రంభ, మామ వెంకటేశ్వరరావు, అత్త ఉషారాణిలపై కోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు 2014 జూలైలో ఐపీసీ 498(ఏ) తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు లో హాజరుకావాలని మూడు నెలల క్రితం న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అప్పుడు విదేశాల్లో ఉన్న రంభకు సమన్లు అందలేదు. దీంతో మరోసారి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

LEAVE A REPLY