వన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.2 లక్షల పరిహారం

0
26

తెలంగాణ:సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో నిర్వాసితులైన వారి త్యాగాలకనుగుణంగా సాధ్యమైన మేరకు అదనపు ప్రయోజనాల కల్పనే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల నిర్వాసితులను వివిధ రకాలుగా ఆదుకుంటున్నది. మౌలిక వసతుల కల్పన మొదలు న్యాయపరంగా దక్కాల్సిన ప్రతి పైసాను వెంటనే చెల్లిస్తున్నది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి కాకుండా భూనిర్వాసితుల్లో 2015 జనవరి ఒకటో తేదీ నాటికి మేజైర్లెన ప్రతి ఒక్కరికీ వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద అదనంగా రూ.2 లక్షలు చెల్లిస్తామన్న సీఎం కే చంద్రశేఖర్‌రావు హామీ అమలుకు వీలుగా సర్కార్ నిధులు విడుదలచేసింది. దీని ప్రకారం ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, గౌరవల్లి రిజర్వాయర్ల కింద నిర్వాసితులైన కుటుంబాల్లో 9484 మందికి లబ్ధి చేకూరింది.

LEAVE A REPLY