వణికిన హైదరాబాద్‌

0
16

హైదరాబాద్‌: విరిగిపడిన చెట్లు, తెగిన విద్యుత్‌ వైర్లు, చిరిగిపోయిన పోస్టర్లు, దెబ్బతిన్న ఇళ్ల పైకప్పులు.. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి ఆనవాళ్లుగా మిగిలాయి. బలమైన ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో నగరమంతటా విద్యుత్ సరఫరా స్తంభించింది. నగరవాసులు రాత్రంతా కరెంట్‌ లేకుండా గడిపారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్‌ లేదు. కరెంట్‌ లేకపోవడంతో కార్యాలయాల్లో విధులకు తీవ్ర అంతరాయం కలిగింది.
విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విరిగిన చెట్ల కొమ్ములు, తెగి పడిన తీగలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈదురు గాలులకు తోడు వడగళ్ల వాన పడడంతో రేకుల ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు- స్తంభాలు విరిగి ఇళ్లు, కార్యాలయాలు, వాహనాలపై పడ్డాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిపోయిన నీరు, బురదను తొలగిస్తున్నారు.

LEAVE A REPLY