వడోదర బస్టాండ్ ఆదర్శం

0
31

పాలనా సంస్కరణలతో వివిధ రంగాలను అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరుచడంపై కూడా దృష్టి సారించింది. ఇదివరకే పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ప్రయాణికులకు సకల సౌకర్యాలు ఉండే ఆధునిక బస్‌స్టేషన్ల నిర్మాణంపై కొంతకాలంగా యోచిస్తున్నది. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల మాదిరిగా బస్‌పోర్టులను ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ఇందుకోసం ప్రజా రవాణావ్యవస్థల్లో మార్పులపై చర్చించడానికి మంగళవారం గుజరాత్‌లోని వడోదరలో నిర్వహిస్తున్న వివిధ రాష్ర్టాల రవాణాశాఖ మంత్రుల బృందం(జీవోఎం) సదస్సు కు రాష్ట్రం నుంచి ప్రతినిధులను పంపిస్తున్నది. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు రవాణాశాఖ జాయింట్ కమిషనర్ రఘునాథ్ ఈ సదస్సుకు హాజరవుతారు. ప్రజారవాణా వ్యవస్థల్లో సం స్కరణలపై జీవోఎం సదస్సు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆధునిక బస్‌పోర్టుల నిర్మాణం ప్రధాన ఎజెండాగా ఈ సదస్సులో చర్చిస్తారు. బస్టాండ్లను ఎయిర్‌పోర్టుల మాదిరిగా తీర్చిదిద్ది, ప్రయాణికులకు ఆధునిక వసతులు కల్పించే మార్గాలను అన్వేషిస్తారు.

LEAVE A REPLY