వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి భాజపా అభ్యర్థిగా : రేష్మా రాథోడ్‌

0
5

డోర్నకల్‌: వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సినీ నటి రేష్మా రాథోడ్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె డోర్నకల్‌కు వచ్చారు. తొలుత స్థానిక భాజపా నేతలు కలుసుకున్నారు. అనంతరం స్థానిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారి వినతి మేరకు పట్టణంలోని ప్రధాన వీధిలో రోడ్డు విస్తరణలో భాగంగా గతంలో కూల్చిన దుకాణాలు ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వస్థలం ఖమ్మం జిల్లా ఇల్లెందు అని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విద్యాభ్యాసం చేసినట్లు చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలనే డిమాండ్‌తో తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY